వైఎస్ వివేకా తలకు గాయాలు… మృతిపై అనుమానాలు

వైఎస్ వివేకా తలకు గాయాలు… మృతిపై అనుమానాలు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్ జగన్ బాబాయి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి మరణంపై అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆయన మరణంపై దర్యాప్తు చేయాలని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి కడప జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు వివరాలను సీఐ శంకరయ్య వివరించారు. వైఎస్ వివేకా మరణంపై తమకు ఈ ఉదయం 8గంటలకు ఫిర్యాదు అందిందని సీఐ శంకరయ్య చెప్పారు. రోజూ పొద్దున్నే ఐదున్నరకు వైఎస్ వివేకాను నిద్రలేపి ఆయనకు కాఫీ, టీ అందించే అలవాటు పీఏ కృష్ణారెడ్డికి ఉందనీ.. కానీ.. ఇవాళ ఉదయం ఆయన బెడ్ పై కనిపించలేదని… బాత్ రూమ్ లో రక్తపు మడుగులో వైఎస్ వివేకానంద రెడ్డి పడి ఉన్నాడని పీఏ కృష్ణారెడ్డి తమకు ఫిర్యాదు చేసినట్టు సీఐ చెప్పారు. ఆయన తల, నుదురు, కన్ను, ముక్కు, నోరు భాగాల్లో గాాయలైనట్టు ఆయన ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. ఈ ఫిర్యాదుపై తాము ఉన్నతాధికారుల సహాయంతో సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టినట్టు సీఐ చెప్పారు.