V6 News

Weekend OTT Release: వీకెండ్ వినోదం: ఒకే రోజు ఓటీటీలో 20 సినిమాలు స్ట్రీమింగ్.. థియేటర్లలో ఎన్ని రిలీజ్ అంటే?

Weekend OTT Release: వీకెండ్ వినోదం: ఒకే రోజు ఓటీటీలో 20 సినిమాలు స్ట్రీమింగ్.. థియేటర్లలో ఎన్ని రిలీజ్ అంటే?

సినిమా ప్రిమికులకు అసలైన విందు మొదలుకాబోతోంది. మరో వీకెండ్ వచ్చేసింది.  సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే చాలు వెండితెరపై కొత్త సినిమాల సందడి, ఇటు ఇంట్లోనే కూర్చుని చూసే ఓటీటీ చిత్రాల హడావుడి మామూలుగా ఉండదు. అయితే, ఈ వారం (మే 1) మాత్రం వినోదం డబుల్ డోస్ కాబోతోంది. అటు థియేటర్లలో నవ్వుల జల్లు కురిపించడానికి సత్య సిద్ధమవ్వగా, ఇటు ఓటీటీలో ఏకంగా 20కి పైగా చిత్రాలు, సిరీస్‌లు క్యూ కట్టాయి.

థియేటర్ల వద్ద సందడి

ఈ వారం బాక్సాఫీస్ బరిలో టాలీవుడ్ నుంచి కమెడియన్ సత్య తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.  ‘మత్తు వదలరా’ ఫేమ్ సత్య హీరోగా, రితేష్ రాణా దర్శకత్వంలో వస్తున్న  మూవీ జెట్లీ (Jetlee). ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. సమ్మర్ సెలవుల్లో కడుపుబ్బ నవ్వించడానికి సత్య గ్యాంగ్ రెడీ అయిపోయింది.

 

కర (Kara): కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ‘కరా’ సైతం ఈ వారమే బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ధనుష్ మార్క్ యాక్షన్ మరియు పెర్ఫార్మెన్స్ కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఇది మంచి ఛాయిస్.

 

ఓటీటీలో ‘హై-వోల్టేజ్’ వినోదం

ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూడాలనుకునే వారి కోసం ఓటీటీ సంస్థలు భారీ లైనప్‌ను సెట్ చేశాయి. ప్రధానంగా నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా వేదికలపై క్రేజీ అప్‌డేట్స్ ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

ఈ వారం నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్క్రైబర్ల కోసం తెలుగు చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. శర్వానంద్ హీరోగా మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన  చిత్రం 'బైకర్ (Biker)' మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్,  రేసింగ్ యాక్షన్ దీనికి ప్రధాన బలం . రాకాస (Rakasa): సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘రాకాస’ కూడా రేపటి మే 1 నుంచే అలరించనుంది.

 

ఒక ఇంటెన్స్ డ్రామాగా సాగే గ్లోరీ (Glory) సిరీస్ తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులోకి రానుంది. వీటితో పాటు స్వాప్‌డ్, మై డియరెస్ట్ సెనోరిటా, బే బ్లాడెక్స్ సీజన్-2, మై ఫేవరేట్ వెడ్డింగ్ వంటి హాలీవుడ్ సినిమాలు, యానిమేషన్ చిత్రాలు లైన్లో ఉన్నాయి.

జీ5 (ZEE5)

జీ5లో ఈ వారం అత్యంత వివాదాస్పద చిత్రం విడుదలకు సిద్ధమైంది. ద కేరళ స్టోరీ  మొదటి భాగం సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీని సీక్వెల్ ‘ద కేరళ స్టోరీ-2’ తెలుగు డబ్బింగ్‌తో సహా ఓటీటీలోకి వస్తోంది.  మలయాళ సూపర్ హిట్ కామెడీ మూవీ ‘ఆడు’ మూడవ భాగం తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

 

ఆహా & అమెజాన్ ప్రైమ్

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో చిన్న సినిమాగా వచ్చి క్రేజ్ తెచ్చుకున్న ‘సోదర’ మే 1న విడుదలవుతోంది. అమెజాన్ ప్రైమ్లో యువతను ఆకట్టుకున్న ‘సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2’ హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఒక్క రోజే 20 చిత్రాలు

సోనీ లివ్‌లో ‘ఉందేఖి సీజన్ 4’, సన్ నెక్ట్స్‌లో ‘మనితదేయివమగలం’,  హెచ్‌బీవో మ్యాక్స్‌లో ‘ఉథరింగ్ హైట్స్’ వంటి అంతర్జాతీయ చిత్రాలు కూడా ఉన్నాయి. థియేటర్లలో కామెడీ కావాలా? ఓటీటీలో థ్రిల్లర్స్ కావాలా? లేక రేసింగ్ మూవీస్ కావాలా? ఛాయిస్ మీదే, మీ ఫేవరేట్ మూవీని సెలెక్ట్ చేసుకుని ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేసేయండి..