V6 News

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్..  RCB ఫస్ట్ బ్యాటింగ్

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్..  RCB ఫస్ట్ బ్యాటింగ్

IPL 2026: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 42వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టైటాన్స్ జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో మొదట బ్యాటింగ్ చేయడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. గిల్ సేన ఆరంభంలోనే వికెట్లు తీసి బెంగళూరును కట్టడి చేయాలని చూస్తోంది. కానీ డిఫెండింగ్ ఛాంపియన్స్ భారీ స్కోరు సాధిస్తారా లేక టైటాన్స్ బౌలర్లు పైచేయి సాధిస్తారా అనేది వేచి చూడాలి.  

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. ఇక్కడ ఆరంభ ఓవర్ల పాటు పిచ్ స్వింగ్‌కు సహకరిస్తుంది.. ఒకవేళ మంచు (Dew) ప్రభావం ఉంటే ఛేజింగ్‌కు సులభంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాం.. ఈ మెగా టోర్నీలో మా ప్రయాణం ఎలా ఉండబోతుందో ఈ రెండు మ్యాచులు నిర్ణయిస్తాయని గిల్ వెల్లడించాడు. ఈ మ్యాచులో ఎటువంటి మార్పులు లేకుండా తమ పాత జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని పేర్కొన్నారు.  

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట ఫీల్డింగ్ చేయాలని అనుకున్నాం.. కానీ పిచ్‌పై ఉన్న గడ్డి పెద్దగా ప్రభావం చూపుతుందని నేను అనుకోవడం లేదు.. బోర్డుపై మంచి స్కోరు ఉంచుతామని ఆశిస్తున్నాను.. గత మ్యాచుల్లో ఆడిన జట్టుతోనే (No Changes) బరిలోకి దిగుతున్నామని పాటిదార్ తెలిపారు. 

తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్