నోటితో పొగిడి..నొసటితో వెక్కిరించేలా ఉన్నాయి 

నోటితో పొగిడి..నొసటితో వెక్కిరించేలా ఉన్నాయి 
  • బడ్జెట్ కేటాయింపులపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విసుర్లు

హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల గురించి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎక్కువ... చేస్తున్న ఖర్చు తక్కువ.. నోటితో పొగిడి..నొసటితో  వెక్కిరించేలా ఉన్నాయి బడ్జెట్ కేటాయింపులు అంటూ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... క్రీడలకు స్పోర్ట్స్ పాలసీ ఉండాలి.. అలాంటిది
 బడ్జెట్ లో నిధులే కేటాయింపులు లేకపోవడం దురదృష్ట కరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఉదాసీనత వల్ల క్రీడా వేదికలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని ఆరోపించారు. మద్యంపై నియంత్రణ ఉండాలి.. యాదాద్రిలో బార్ ఎండ్ రెస్టారెంట్ పెట్టడానికి అనుమతిస్తే.. 250కి పైచిలుకు దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఏంటో అర్దం చేసుకోవాలని అన్నారు. న్యాయవాది వామన రావు దంపతుల హత్య గురించి ప్రస్తావిస్తూ.. వారిని దారి కాచి చంపడం బాధాకరమన్నారు. పెద్ద అధికారి హోదాలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయానంటూ రిటైర్డు జైళ్ల శాఖ డీజీ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం తీరుకు నిదర్శనమన్నారు.