
హైదరాబాద్ : TSPSC ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు బీజేపీ యువ మోర్చా నేతలు. బీజేపీ కార్యాలయం నుంచి TSPSC ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లిన నేతలు నిరసన తెలిపారు. TSPSC ఆఫీస్ ముందు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు… భారీ కేడ్లు, ముళ్లకంచలు ఏర్పాటు చేశారు. పోలీసులు అడ్డుకోవటంతో వాగ్వాదానికి దిగారు నేతలు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… పీఎస్ కు తరలించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ యువ మోర్చా నేతలు.. నిరుద్యోగ భృతిని ప్రకటించాలన్నారు. సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు.