గద్దర్ వారసత్వాన్ని కొనసాగించాలి

గద్దర్ వారసత్వాన్ని  కొనసాగించాలి

ముషీరాబాద్, వెలుగు: ప్రజా కవి గద్దర్ వారసత్వాన్ని కొనసాగించాలని ప్రొఫెసర్ హర గోపాల్ అన్నారు. ఆదివారం రాత్రి బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘భారత్ బచావో’ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా కవి గద్దర్, సియాసత్ ఎడిటర్ జహిర్ అలీ ఖాన్ సంతాప సభ జరిగింది.  హరగోపాల్, జేబీ రాజు హాజరై గద్దర్, జహీర్ ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హరగోపాల్ మాట్లాడుతూ..  గద్దర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, గోపీనాథ్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.