
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ లు.. రెండు పార్టీలు మోసం చేశాయన్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా నిర్వహించిన సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్ లో పెట్టి టిఫిన్ చేసి వచ్చే పరిస్థితి ఉండేదని అన్నారు. చెరుకు ముత్యంరెడ్డి ని నాలుగు సార్లు గెలిపిస్తే కనీసం త్రాగు నీరైనా ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉండి రైతులను గోస పెడితే.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బోర్ ల కాడ మీటర్లు పెడతామంటూ రైతులను మోసం చేస్తున్నదన్నారు. బీజేపీకి ఓటేస్తే మన వేలు తో మన కన్ను పొడుసుకున్నట్టేనన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే కరెంటు ప్రైవేటు, వ్యవసాయం ప్రైవేటు, రైల్వే ప్రైవేటు.. అంతా ప్రైవేటే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం
124990 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.