
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంతోపాటు త్వరలో ఎలక్షన్స్ జరగనున్న ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ హైకమాండ్అబ్జర్వర్లను నియమించింది. ఇందులో తెలంగాణకు సీనియర్ అబ్జర్వర్‌గా దీప దస్మున్షి, అబ్జర్వర్‌గా డా.సిరివెళ్ల ప్రసాద్ ను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) వేణుగోపాల్ ఉత్తర్వులు రిలీజ్ చేశారు.
వెస్ట్ బెంగాల్‌కు చెందిన దీప దస్మున్షి.. 2012–2014 వరకు కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రిగా సేవలందించారు. 2006 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా, అంతకు ముందు వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశారు. ఏపీకి చెందిన డా. సిరివెళ్ల ప్రసాద్ ఏఐసీసీ సెక్రటరీ, తమిళనాడు ఇన్చార్జ్గా ఉన్నారు. వీరితో పాటు రాజస్థాన్‌కు సీనియర్ అబ్జర్వర్‌గా మధుసూదన్ మిస్త్రీ, అబ్జర్వర్‌గా ససికాంత్ సెంతిల్, మధ్య ప్రదేశ్ సీనియర్ అబ్జర్వర్‌గా రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, అబ్జర్వర్‌గా చంద్రకాంత్ హ్యాండోర్, చత్తీస్‌గఢ్ సీనియర్ అబ్జర్వర్‌గా ప్రీతంసింగ్, అబ్జర్వర్‌గా మీనాక్షి నటరాజన్, మిజోరాం అబ్జర్వర్‌గా సచిన్ రావును కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నియమించారు.