డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పీసీసీ అబ్జర్వర్లు : మీనాక్షి నటరాజన్

డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పీసీసీ అబ్జర్వర్లు :  మీనాక్షి నటరాజన్
  •     కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రకటన 

హైదరాబాద్, వెలుగు: గత కొంతకాలంగా పెండింగ్‌‌‌‌లో ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల నియామకంతో పాటు రామగుండం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకం కోసం పీసీసీ అబ్జర్వర్లను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు, ఎండీ రియాజ్, నేరెళ్ల శారదను అబ్జర్వర్లుగా  నియమించారు. 

అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి పటేల్ రమేశ్ రెడ్డి, ఈవీ శ్రీనివాస్, ఎమ్మెల్యే రాగమయిని, రామగుండం సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంఏ ఫయీం, బోదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ యాదవ్‌‌‌‌ను నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ అబ్జర్వర్లు ఆయా జిల్లాల స్థానిక నాయకులు, శ్రేణుల అభిప్రాయాలను సేకరించి, అధ్యక్ష బాధ్యతలకు ఎవరు అనువైనవారో పేర్కొంటూ పీసీసీకి సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ఆ రిపోర్టు ఆధారంగానే పీసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.