
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని నందినగర్ డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో కవిత ఓటుహక్కు వినియోగించుకున్నారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. అయితే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే అవుతుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని సీఈవో వికాస్‌రాజ్ ను కోరినట్లు నిరంజన్ తెలిపారు.