- ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీ కమిషనర్ రాణి కుముదినికి ఆదివారం ఆయన లేఖ రాశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరులో కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు కారు గుర్తుకు కాకుండా వేరే గుర్తువైపు చూసినా కళ్లు పోతాయని ఓ పంతులు చెప్పారని అన్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ప్రచారంలో అధికార పార్టీ వెయ్యి, 2 వేలు ఇచ్చినా తీసుకోవాలని, 2 వేలు ఇస్తే 5 వేలు అడగాలని, 5 వేలు ఇస్తే 10 వేలు అడగాలని ఓటర్లతో కేటీఆర్ అన్నారని ఆయన పేర్కొన్నారు.
