
న్యూఢిల్లీ: డెబ్బై ఐదేండ్ల వయసు వచ్చిన వాళ్లు పదవుల నుంచి తప్పుకోవాలని తానెప్పుడూ చెప్పలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆయన చెప్పిన రెండు వెర్షన్ మాటలను షేర్ చేస్తూ, రెండు నాల్కల ధోరణి అంటే ఇదేనని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ కామెంట్ చేశారు. నెల రోజుల గ్యాప్‌లోనే రెండు రకాలుగా మాట్లాడేవాళ్లెవరైనా ఉన్నారంటే అది మోహన్ భాగవత్ మాత్రమేనని అన్నారు.
75 ఏండ్లకు రిటైర్మెంట్ తీస్కోవాలన్న వ్యక్తి, ఆయనకే 75 ఏండ్లు నిండే సమయం వచ్చేసరికి మాట మార్చారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎవరైనాసరే 75 ఏండ్లకు రిటైర్మెంట్ తీస్కుని, కొత్తవాళ్లకు చాన్స్ ఇవ్వాలని కొద్దిరోజుల కిందే భాగవత్ ప్రకటించారు. దాంతో ఈ సెప్టెంబర్‌తో 75 ఏండ్లు పూర్తిచేసుకోనున్న ప్రధాని మోదీ, భాగవత్ పదవీ విరమణ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి.