నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ నుంచి కాంగ్రెస్ ఎలిమినేట్

నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ నుంచి కాంగ్రెస్ ఎలిమినేట్

నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన రాములు నాయక్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎలిమినేషన్ ప్రకియ కొనసాగుతుండటంతో నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కీలక దశకు చేరుకుంది.  ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఏ అభ్యర్థికీ సగం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. దాంతో సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఇప్పటి వరకు 67 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ అయిన అభ్యర్థుల సెకండ్ ప్రాధాన్యత ఓట్లను.. లీడ్‌లో ఉన్న అభ్యర్థులకు బదిలీ చేశారు. 

ఓట్ల బదిలీతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,18,566 ఓట్లు వచ్చాయి. మల్లన్నకు 93,608 ఓట్లు, కోదండరామ్‌కు 81,472 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 42,015 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం రాములు నాయక్‌కు పోలైన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.