ఎనిమిది రాష్ట్రాలకు కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీలు

ఎనిమిది రాష్ట్రాలకు కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీలు
  •      లోక్​సభ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ కనబర్చిన రాష్ట్రాలపై ఫోకస్

న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని రాష్ట్రాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. పూర్ పెర్ఫార్మెన్స్ కు గల కారణాలు తెలుసుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, ఒడిశా, ఢిల్లీ, కర్నాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కు ఈ కమిటీలు వేశారు.

 ఈ మేరకు బుధవారం పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో తెలంగాణకు సంబంధించి నిజనిర్ధారణ కమిటీలో పార్టీ సీనియర్ నేతలు పీజే కురియన్, రఖీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ కు బాధ్యతలు అప్పగించారు. అలాగే, మధ్యప్రదేశ్ నుంచి పృథ్వీరాజ్ చౌహాన్, సప్తగిరి ఉల్కా, జిగ్నేశ్ మేవానీ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. 

చత్తీస్​గఢ్ నుంచి వీరప్ప మొయిలీ, హరీశ్ చౌదరి, ఒడిశా కమిటీలో అజయ్ మాకెన్, తారిక్ అన్వర్ ఉన్నారు. ఇక ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మూడు రాష్ట్రాలకు కలిపి పీఎల్ పునియా, రజనీ పాటిల్ కు చోటు కల్పించారు. కర్నాటక కమిటీకి మధుసూదన్ మిస్త్రీ, గౌరవ్ గొగోయ్, హిబీ ఈడెన్ ను మెంబర్లుగా నియమించారు.

మరిన్ని వార్తలు