పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గిస్తాం.. మహిళలకు ఏడాదికి లక్ష

పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గిస్తాం.. మహిళలకు ఏడాదికి లక్ష

తాము అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా పెట్రో ల్, డీజిల్ రేట్లను భారీగా తగ్గిస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రకటించింది . సార్వత్రిక ఎన్నికలకు మేనిఫేస్టో రిలీజ్  చేసింది కాంగ్రెస్.  మహాలక్ష్మీ పథకం ద్వారా పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల నగదు  ఇస్తామని చెప్పారు.  యువతకు 30లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అగ్నీవీర్ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారు.  దేశ వ్యాప్తంగా కులగణణ చేస్తామని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 50 శాతం రిజర్వేషర్లు కల్పిస్తామని వెల్లడించారు .  వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపునిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో 7.8వృద్దిరేటు ఉండేదని..గత పదేళ్లలో 5.8 మించడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం సంపన్నుల కోసమే పనిచేస్తుందని విమర్శించారు . దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. 

మేనిఫేస్టోలో కీలక అంశాలు

  • యువతకు 30 లక్షల ఉద్యోగాలు
  • అగ్నీవీర్ స్కీమ్ రద్దు..పాతపద్దతిలోనే ఆర్మీ రిక్రూట్ మెంట్
  •  దేశ వ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ
  •  దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ
  • పెగాసస్, రాఫెల్ పై విచారణ
  • ఎలక్టోరల్ బాండ్లపై విచారణ 
  • 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
  • పెట్రోలో డీజిల్ రేట్లు తగ్గింపు
  •  కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత
  •  వ్యవసాయ పరికారలకు జీఎస్టీ రద్దు
  •   ఉపాధీ హామీ పథకం కింద రోజుకు రూ. 400 వేతనం
  • రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు  టికెట్లలో రాయితీ
  • మహాలక్ష్మీ స్కీం కింద ఏడాదికి లక్ష
  • దేశ వ్యాప్తంగా కలగణన
  • రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత
  •  విద్యార్థులకు లక్ష సాయం


 

ALSO READ :- Pushpa 2: రష్మిక బర్త్ డే ట్రీట్.. పుష్ప 2 నుంచి శ్రీవల్లి లుక్ రిలీజ్