బలపరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేలకు నోటీసులు 

బలపరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేలకు నోటీసులు 

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసిన ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హైకమాండ్ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అసెంబ్లీలో జరిగిన బల పరీక్షకు ఆలస్యంగా వచ్చిన మరో 11 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడు భాయ్ జగ్తాప్ హెచ్చరించారు. తాను ఇవాళ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాను. తనతోపాటు చంద్రకాంత్ హండోరే కూడా గెలిస్తే చాలా సంతోషించేవాడినని చెప్పారు. ఆయన ఓటమికి కారణమైన ఏడుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటేనే చంద్రకాంత్ కు న్యాయం జరుగుతుందన్నారు.