ఇరాన్: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ సై అంటే సై అంటున్నాయి. అమెరికా బెదిరింపులను ఏ మాత్రం ఖాతరు చేయని ఇరాన్ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు మరోసారి ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అమెరికా మాపై దాడి చేస్తే.. మేం ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేస్తామని ఇరాన్ తేల్చిచెప్పింది. అలాగే అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు మధ్యప్రాచ్యంలోని యూఎస్ బేస్లన్నింటినీ టార్గెట్ చేస్తామని హెచ్చరించింది. కాగా, ఇరాన్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.
ఇరాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం.. మరోవైపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనతో విసిగిపోయిన ప్రజలు రోడ్డెక్కారు. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిరసనకారులను ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. దీంతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడి చేస్తే మేం రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. నిరసనకారులకు మద్దతుగా ఇరాన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
►ALSO READ | నెత్తురు కక్కుకున్న సైనికులు.. వెనుజులాపై అమెరికా సోనిక్ వెపన్స్ ప్రయోగించిందా..?
దాడులకు దిగుతామంటూ ట్రంప్ పదే పదే హెచ్చరించడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ రియాక్ట్ అయ్యారు. అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే మేం అమెరికా దళాలతో పాటు ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. అమెరికా సైనిక ఆస్తులు, ఇజ్రాయెల్‌ను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్య ప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ టార్గెట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా దాడి చేస్తే ఇరాన్ కేవలం ప్రతిస్పందించడానికి మాత్రమే పరిమితం కాదని.. ముందస్తు చర్య తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ఇక అల్లర్ల సమయంలో కఠినంగా నిలబడ్డారని ఇరాన్ భద్రతా దళాలను ఆయన ప్రశంసించారు. అలాగే నిరసనకారులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని.. ఆందోళనలు చేస్తూ అరెస్ట్ అయినవారిని కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ హెచ్చరికలపై ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరీ...
"
