నెత్తురు కక్కుకున్న సైనికులు.. వెనుజులాపై అమెరికా సోనిక్ వెపన్స్ ప్రయోగించిందా..?

నెత్తురు కక్కుకున్న సైనికులు.. వెనుజులాపై అమెరికా సోనిక్ వెపన్స్ ప్రయోగించిందా..?

మేము గస్తీ కాస్తున్నాం. సడెన్ గా మా రాడార్ సిస్టం పనిచేయడం ఆగిపోయింది. ఒక  దశలో ఏదో ఆయుధాన్ని ప్రయోగించారు. దాన్ని ఎలా వర్ణించాలో తెలియదు. కానీ.. సడెన్ గా తల పేలిపోయినంత పని అయ్యింది. మా ముక్కుల్లోంచి నెత్తురు బొట్లు బొట్లుగా రాలుతోంది. రక్తం కక్కుకున్నాం.. కింద పడిపోయాం.. ఇవి వెనుజులా సైనికుడు ఎక్స్ లో షేర్ చేసిన అంశాలు. అమెరికా చేసిన దాడిలో వాడిన ఆయుధాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న పరిస్థితి.

వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను పట్టుకునేందుకు అమెరికా చేసిన దాడిలో శక్తివంతమైన ఆయుధాలు వాడినట్లు.. సైనికులు షేర్ చేయడంతో ప్రపంచం దృష్టికి వచ్చింది. వైట్ హౌస్ సెక్రటరీ షేర్ చేసిన అకౌంట్లో.. వెనుజులా సైనికాధికారి షేరర్ చేసుకున్న అంశాలు ఇతర దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

తాము 20 ట్రూప్స్ ఉండగా.. కేవలం 8 హెలికాప్టర్లలో చాలా కొద్ది మంది టీమ్ తో.. అమెరికా సైన్యం అందరినీ రౌండప్ చేసిందనీ.. యుద్ధ భూమిని అతికొద్ది మంది ఉన్న టీమ్ డామినేట్ చేసినట్లు చెప్పారు. టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్ డ్ ఆయుధాలను వాడినట్లు.. గ్వార్డ్ చెప్పారు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని యుద్ధాన్ని చూసినట్లు తెలిపాడు.

అది యుద్ధం కాదు.. ఊచకోత:

అమెరికా సైన్యం జరిపిన దాడి యుద్ధం కాదని, ఊచకోత అని సైనికుడు అభిప్రాయపడ్డాడు. అంతమంది సైన్యాన్ని కేవలం కొందరే క్యాప్చర్ చేసినట్లు చెప్పాడు. వాళ్ల వేగం, తీవ్రతను తట్టుకోలేపోయినట్లు తెలిపాడు. 

మేము వందల మంది ఉన్నా ఏం చేయలేకపోయాం.. వాళ్లు అంత తీవ్రతతో.. అంతకు మించిన వేగంతో షూట్ చేశారు. ఒక్కొక్క సైనికుడు నిమిషానికి 300 రౌండ్లు ఫైరింగ్ చేసినట్లు అనిపించిందని చెప్పాడు. ఆ సందర్భంలో ఏదో విచిత్రమైన ఆయుధాన్ని వాడారని అన్నాడు. ఆ ఆయుధం కారణంగా ముక్కు అదిరి, నోటి నుంచి రక్తం కక్కుకున్నాం.. తల పగిలినట్లై కింద పడిపోయాం.. అంటూ భయంకర వాతావరణం గురించి వివరించాడు. అది సూపర్ సోనిక్ వెపన్ అయ్యుంటుందని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. భారీ శబ్దం కారణంగా చెవులు పగిలి.. మైండ్ బ్లాస్ట్ అయ్యి.. రక్తం కక్కుకు చచ్చేంత తీవ్రత కలిగిఉన్న ఆయుధాలు వాడినట్లు భావిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అమెరికా మాత్రం సమాధానం చెప్పలేదు. 

►ALSO READ | ఇండియాపై భారీ దాడులకు కుట్ర..? ఒకరిద్దరూ కాదు.. ఏకంగా 1000 మంది సూసైడ్ బాంబర్లు రెడీ..!

వెనుజులా సైనికుడు అందించిన వివరాల ప్రకారం చూస్తే.. టార్గెట్స్ ను ధ్వంసం చేసేందుకు వినియోగించే మైక్రోవేవ్స్ లేదా లేజర్స్ ను వాడినట్లు తెలుస్తోందని యూఎస్ మాజీ ఇంటెలిజెన్స్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఇలాంటి ఆయుధాలు అమెరికా సైన్యం దగ్గర దశాబ్దాలకు ముందునుంచే ఉన్నాయి... ఇలాంటి ఆయుధాలు ప్రయోగిస్తే రక్త స్రావం, భరించలేని నొప్పి, మంట, కదలేని స్థితికి పోవడం.. లాంటి పరిణామాలు ఉంటాయని చెప్పారు. 

ఇండియా సైనికులపై చైనా కూడా ఇలాంటి మైక్రోవేవ్ వెపన్స్ వాడినట్లు ఆరోపణలున్నాయి. 2020 లో లడఖ్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణంలో.. చైనా ఇలాంటి ఆయుధాలు ప్రయోగించినట్లు విమర్శించారు. అయితే ఈ వాదానలను అప్పట్లో చైనా కొట్టిపారేసింది. 

ఆ దేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారా..?

వెనుజులా వంటి చిన్న దేశంపై సూపర్ సోనిక్ వెపన్స్ పంపిచండంలో అమెరికా ఆంతర్యం ఏమిటనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చునని.. వెనిజులా సైనికులు చెబుతున్నారు. మెక్సికో లాంటి లాటిన్ అమెరికా దేశాలకు వార్నింగ్ ఇచ్చేందుకే ట్రంప్ ప్రభుత్వం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు పేర్కొన్నారు.