IND vs NZ: కోహ్లీ @ 28000.. ఫాస్టెస్ట్ ప్లేయర్‌గా సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్.. సంగక్కర కూడా వెనక్కి

IND vs NZ: కోహ్లీ @ 28000.. ఫాస్టెస్ట్ ప్లేయర్‌గా సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్.. సంగక్కర కూడా వెనక్కి

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. కోహ్లీ బ్యాటింగ్ ధాటికి ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక రికార్డ్ బ్రేక్ అవ్వడం సహజం. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలోనూ కోహ్లీ ఖాతాలో ఒక అద్భుతమైన రికార్డ్ చేరింది. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా ప్రారంభమైన మ్యాచ్ లో ఇండియా 300 పరుగుల టార్గెట్ ను ఛేజింగ్ చేస్తోంది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ తన 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా 28000 పరుగులను పూర్తి చేసుకున్న ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 

ఇన్నింగ్స్ 13 ఓవర్లో ఆదిత్య అశోక్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన విరాట్.. ఈ ఘనతను అందుకున్నాడు. అంతకముందు ఈ రికార్డ్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 28 వేల పరుగులు చేయడానికి సచిన్ కు 644 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. మరోవైపు కోహ్లీ 624 ఇన్నింగ్స్ ల్లోనే ఈ మైల్ స్టోన్ చేరుకున్నాడు. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సంగక్కర 28 వేల పరుగులు చేయడానికి 666 ఇన్నింగ్స్ లు తీసుకుని మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 

►ALSO READ | T20 World Cup 2026: వరల్డ్ కప్ మా దేశంలో ఆడుకోండి.. బంగ్లాదేశ్‌కు ఆఫర్ ఇస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

ఈ మ్యాచ్ లో కోహ్లీ.. సంగక్కర రికార్డ్ కూడా బద్దలు కొట్టాడు. కోహ్లీ (28017*) తన వ్యక్తిగత స్కోర్ 42 పరుగుల వద్ద సంగక్కరను (28016) వెనక్కి నెట్టి అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు.  34357 పరుగులతో తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 

ఛేజింగ్ దిశగా టీమిండియా: 

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ విధించిన 300 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో ప్రస్తుతం ఇండియా 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ (52), గిల్ (46) ఉన్నారు. రోహిత్ శర్మ 26 పరుగుల వద్ద ఔటయ్యాడు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. మిచెల్ 84 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.