
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎంతో చర్చించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ ఒక్క బూతు మాట మాట్లాడితే సీఎం పది తిట్లు తిడతారని అన్నారు. సీఎంను గోకడమెందుకు..?తన్నిపిచ్చుకోవడమెందుకని ప్రశ్నించారు జగ్గారెడ్డి. కేటీఆర్ చిన్నపిల్లల మాదిరి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు తిడితే పడేవారు ఎవరూ లేరన్నారు. కేటీఆర్ ఒకటి అంటే పది మాటలంటామని ఇందులో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదన్నారు జగ్గారెడ్డి.
జులై 8న గాంధీభవన్ లో మాట్లాడిన జగ్గారెడ్డి.. ఈ మధ్య కేటీఆర్ తెలంగాణలో ఉండటం లేదు. నెలకోసారి విదేశాలకు వెళ్తున్నారు. నెలకు 20 రోజులు కేటీఆర్ విదేశాల్లోనే గడుపుతున్నారు. తెలంగాణ అభివృద్ధి కేటీఆర్ కు బహుశా తెల్వదు. రాష్ట్ర హక్కులను కాపాడేందుకే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. పదేండ్లు పాలించిన కేసీఆర్ ఏనాడైనా కేంద్రం దగ్గరకు వెళ్లారా?. కేటీఆర్ తీరు చిన్న పిల్లల మాదిరి ఉంది. మీరు మాట్లాడేదాన్ని బట్టే మా తీరు ఉంటుంది.
ALSO READ | నల్గొండ జిల్లాలో భూసమస్యలకు పరిష్కారం చూపాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సీఎంతో చర్చించే స్థాయి కేటీఆర్ కు లేదు. సీఎంను గోకుడెందుకు..తన్నిపిచ్చుకోవడం ఎందుకు .?. కేటీఆర్ సర్పంచ్ గా గెలిచారా? జడ్పీటీసీగా గెలాచారా?. కేటీఆర్ కు డక్కాముక్కీలు ఎలా తెలుస్తయ్. వాళ్ల నాన్న సీటు ఇస్తే డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యాడు. మేం ఎన్నో వ్యయప్రయాసలతో రాజకీయ నేతలం అయ్యాం. అనుభవంతో కూడిన రాజకీయం మాది. మా అనుభవం ముందు కేటీఆర్ జీరో. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు.
కేటీఆర్ ఒకటి అంటే మే పది మాటలంటాం. గాడిదలంటే పడేవాళ్లు ఎవరూ లేరిక్కడ. ఐదేళ్లు పాలించాలని ప్రజలు మాకు అవకాశం కల్పించారు. ప్రజాపాలన అందించాలనేదే మా లక్ష్యం. మీరు ఒక్క తిట్టుతిడితే సీఎం పది బూతులు తిడతాడు. ఇందులో కాంప్రమైజ్ అయ్యేదే లేదు . కేటీఆర్ కవిత దెబ్బలకు తట్టుకోలేకపోతున్నారు. 18 నెలలుగా అధికారం లేకపోయేసరికి కేటీఆర్ ఓడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటుండు అని అన్నారు.