కేసీఆర్ తీరు.. దొర లెక్కున్నది

కేసీఆర్ తీరు.. దొర లెక్కున్నది

హైదరాబాద్,వెలుగు: ‘‘నేను దొరని.. అంద రూ నా కాళ్ల దగ్గరే బతకాలే”అన్నట్లు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మంగళవారం గాంధీ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు.

గంగుల కమలాకర్​ కింది స్థాయి నుంచి వచ్చిన మంత్రి అని, ఆయన డీలర్ల సమస్యలు అర్థం చేసుకోవాలన్నారు. కరోనా టైంలో ప్రజలకు రేషన్ డీలర్లు ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు. సమస్యలు పరిష్కారించే వరకు రేషన్ డీలర్లకు కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందన్నారు.