మాణిక్కం vs కేటీఆర్.. లీగల్ నోటీస్ పంపిన కాంగ్రెస్ అగ్రనేత

మాణిక్కం vs కేటీఆర్..  లీగల్ నోటీస్ పంపిన కాంగ్రెస్ అగ్రనేత
  • రేవంత్ పీసీసీ పదవికోసం తనకు రూ. 50 కోట్లు ఇచ్చారని పరువుకు నష్టం చేశారు
  • వారం రోజుల్లో రిప్లయ్ ఇవ్వాలనిపేర్కొన్న మాణిక్క ఠాగూర్
  • మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలనే కోట్ చేశానన్ని కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ నేత, టీపీసీసీ వ్యవహారాల మాజీ ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు పంపారు. ఈ నెల 28న సిరిసిల్లలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పీసీసీ చీఫ్  పదవికోసం రేవంత్ రెడ్డి తనకు రూ. 50 లకోట్లు ఇచ్చారని కేటీఆర్ కామెంట్ చేశారని, ఇది తన పరువుకు భంగం కలిగించిందని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై రిప్లయ్ ఇవ్వని పక్షంలో మధురై కోర్టును ఆశ్రయిస్తానని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. 

గతంలో ఇదే అంశంపై కామెంట్ చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని.. మాణిక్కం మధురై కోర్టు బోను ఎక్కించిన విషయం తెలిసిందే. లీగల్ నోటీసుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో చేసిన కామెంట్లను మాత్రమే అక్కడ ప్రస్తావించానని చెప్పారు. డిఫేమేషన్ పై మంత్రి కోమటిరెడ్డికి నోటీసు పంపిస్తే బాగుంటుందని ట్విట్టర్ వేదికగా సూచించారు.