
పటాన్చెరు, వెలుగు: దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడం కాంగ్రెస్ విజయమేనని కాంగ్రెస్‌నేత నీలం మధు అన్నారు. శుక్రవార్ హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీసీ కుల గణన కోసం గొంతెత్తాడన్నారు. ఆయన సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన చేపట్టడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసి దేశానికి దిశానిర్దేశం చేశారన్నారు. జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆయనతో కాంగ్రెస్ నేతలు, ఎన్ఎంఆర్ సభ్యులు ఉన్నారు.
రాహుల్ గాంధీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
నర్సాపూర్: కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో జనగణనతో పాటు కులగణన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫ్లెక్సీకి నర్సాపూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తామనడమనేది తెలంగాణ ప్రభుత్వ విజయంగా చెప్పవచ్చన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఇందుకోసం ముందుగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసి దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో సురేశ్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, రిజ్వాన్, ఆంజనేయులు గౌడ్, మల్లేశం, ఉదయ్ కుమార్, రాజు యాదవ్, అశోక్ గౌడ్ పాల్గొనారు.
చేర్యాల: తెలంగాణ కుల గణన దేశానికే ఆదర్శంగా మారిందని కాంగ్రెస్‌నేత నాగపురి కిరణ్ కుమార్గౌడ్అన్నారు. మండల కేంద్రంలోని షాదీఖానాలో రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. జనగామ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 24మందికి రూ.10లక్షలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, లలిత, రవిచందర్, చందర్, రాజ్‌కుమార్, రవి, దామోదర్, చందు, రమేశ్, మల్లేశ్పాల్గొన్నారు.