కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ల పాస్​పోర్టులను సీజ్ చేయాలి : కాంగ్రెస్​ నేత నిరంజన్

కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ల  పాస్​పోర్టులను సీజ్ చేయాలి : కాంగ్రెస్​ నేత నిరంజన్

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐఎస్‌‌‌‌బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మాదిరిగానే కేసీఆర్ కుటుంబం కూడా దేశం విడిచి పారిపోయే చాన్స్ ఉందని, వెంటనే వాళ్లందరి పాస్ పోర్టులను సీజ్ చేయాలని రాష్ట్ర పోలీసులను, కేంద్ర హోం శాఖను పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. గురువారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌లో రూ.600 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అక్రమంగా దండుకున్న మాజీ మంత్రి హరీశ్​రావు ఆఫీస్‌‌‌‌లో పని చేస్తున్నోళ్లను అరెస్టు చేశారని గుర్తుచేశారు. పేదలకు ఇచ్చే రిలీఫ్ ఫండ్ విషయంలోనూ హరీశ్ రావు కార్యాలయం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 250 చెక్కులను కాల్చేయడం దారుణమన్నారు. ఈ వ్యవహారంలో హరీశ్​ను కూడా విచారించాలన్నారు. మోసగాళ్లకు ఆశ్రయం ఇచ్చిన హరీశ్ కూడా మోసగాడే అవుతారని విమర్శించారు.