హైదరాబాద్, వెలుగు: ధాత్వి బిజినెస్ సొల్యూషన్స్ తమ క్విక్ కామర్స్ బ్రాండ్ జెస్ట్ బాట్‌ను హైదరాబాద్‌లో ఆదివారం ప్రారంభించింది. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించారు. ఇది స్థానిక కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానించి వినియోగదారులకు వేగంగా సరుకులను చేరవేస్తుంది. కమీషన్ వసూలు చేయబోమని జెస్ట్ తెలిపింది.
కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, చిన్న సంస్థలకు పారదర్శకమైన విధానాలతో మెరుగైన లాభాలు అందిస్తామని ప్రకటించింది. వ్యాపార నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్, సరుకు నిల్వల నిర్వహణ (ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్) వంటి సేవలను కూడా అందివ్వనుంది. భవిష్యత్తులో ఇది ప్రముఖ డిజిటల్ కామర్స్ సంస్థగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
