మురుగునీటిలో కూర్చుని కాంగ్రెస్ నేత నిరసన

మురుగునీటిలో కూర్చుని కాంగ్రెస్ నేత నిరసన

పద్మారావునగర్, వెలుగు: డ్రైనేజీ ఓవర్​ఫ్లో సమస్యపై బన్సీలాల్​పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐత చిరంజీవి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పద్మారావునగర్​లో గాంధీ దవాఖాన వెనుక గత పదేండ్లుగా డ్రైనేజ్ ఓవర్​ఫ్లో సమస్య తీవ్రంగా ఉందని గురువారం మురుగునీటి వద్ద కూర్చొని ఆందోళన చేశారు. 

రూ.45 లక్షల వ్యయంతో డ్రైనేజ్ పనులకు స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి 20 రోజులు గడిచినా పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. కొందరు అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.