దాబాలో టీ తాగుతూ.. పిల్లలతో కబుర్లు చెబుతూ..

దాబాలో టీ తాగుతూ.. పిల్లలతో కబుర్లు చెబుతూ..

పార్టీ మాజీ చీఫ్​తో నడిచిన అశోక్​ గెహ్లాట్, సచిన్​ పైలట్​

ఝలావర్ (రాజస్థాన్): కాంగ్రెస్​ లీడర్​ రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర రాజస్థాన్​లో కొనసాగుతోంది. 89వ రోజైన సోమవారం ఉదయం 6.10 గంటలకు ఝలావర్ జిల్లా ఝల్రాపటాన్​లోని కలితలై నుంచి యాత్ర ప్రారంభమైంది. 13 డిగ్రీల టెంపరేచర్​లో ప్రారంభమైన ఈ యాత్రలో అశోక్​ గెహ్లాట్, సచిన్​ పైలట్​లు రాహుల్​తో కలిసి నడిచారు. పాదయాత్రలో చిన్న పిల్లలతో రాహుల్​ ముచ్చటించారు. రోడ్​ సైడ్ ఉన్న దాబాలో లీడర్లతో కలిసి చాయ్ తాగారు. దాదాపు 14 కిలో మీటర్ల మేర సాగిన పాదయాత్ర బలిబోర్డా చౌరస్తా వద్ద ఆగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు నహర్డి ఏరియాలో భోజనం చేశాక తిరిగి ప్రారంభమైంది. సాయంత్రం చంద్రబాగ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్​లో రాహుల్​ పాల్గొన్నారు.

రాహుల్​తో స్టెప్పులేసిన అశోక్​ గెహ్లాట్, సచిన్​ పైలట్​

భారత్​ జోడో యాత్రలో భాగంగా ఝలావర్​లో రాహుల్​తో కలిసి రాజస్తాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్ డ్యాన్స్​ చేశారు. ముందు రాహుల్​గాంధీ, కమల్​నాథ్​లు కలిసి డ్యాన్స్​ ప్రారంభించారు. తర్వాత గెహ్లాట్, పైలట్​ జతకట్టారు. పైలట్​ చేతులు పట్టుకుని గెహ్లాట్ కూడా రాహుల్​తో కలిసి డ్యాన్స్​ చేశారు. గిరిజన కళాకారులు డ్యాన్స్​ చేస్తున్నప్పుడు వారితో అడుగులో అడుగేశారు.