పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ కంటే అధికారం, కుర్చీపై ఎక్కువ ఇష్టం ఉందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆరోపించారు. బిహార్ లో ప్రస్తుతం బీజేపీకి మద్దతిస్తున్న పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉపసంహరించుకుంటుందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సచిన్ పైలట్ పాట్నాలో విలేకర్లతో మాట్లాడారు.
‘‘బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు అనే నినాదాన్ని ఇచ్చింది. అయితే, దానికి విరుద్ధంగా ఆ పార్టీ 250 సీట్లను కూడా సాధించలేకపోయింది. కాషాయపార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిహార్, ఆంధ్రప్రదేశ్ లోని పార్టీల మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. బీజేపీ ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ నిస్సహాయుడిగా మారారు. సీఎం కుర్చీపై ఆయనకు ఉన్న ఆసక్తి ఈ విధంగా చేసింది” అని పేర్కొన్నారు.
