కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం నంది మేడారం, గాయత్రి పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోస్తుంటే అది తమ వల్లేనని చెప్పుకోవడం బీఆర్ఎస్ నేతల దౌర్భాగ్యానికి నిదర్శనమని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమన్నారు.
అందులో భాగంగానే నంది-మేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లలోని బాహుబలి మోటార్లను ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. రైతుల సాగు, తాగునీటి అవసరాలు తీరేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా చర్యలు చేపడుతుంటే, దానిని తమ పోరాట ఫలితమని బీఆర్ఎస్ ప్రచారం చేయడం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట అన్నారు.
