కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి మండలం ఎలగందల్‌ను దత్తత తీసుకుని ఎవర్‌గ్రీన్ గ్రామంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. గ్రామంలో కొత్తగా రూ.25 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను సీఎం రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రులతో మాట్లాడి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎలగందుల బ్రిడ్జి పూర్తి చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు.
ఇప్పటికే ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడినట్లు చెప్పారు. గ్రామ చెరువులో పేరుకుపోయిన గ్రానైట్ డస్ట్, సిల్ట్ తొలగింపునకు చర్యలు చేపడతామని తెలిపారు. ఎలగందుల ముంపు గ్రామమని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కొంత అన్యాయం జరిగిందన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసేలా కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మల అంజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, ఉపసర్పంచ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు స్వామి, ఏఎంసీ డైరెక్టర్లు పి.శ్రీనివాస్, బి.శ్రీనివాస్, సంపత్ పాల్గొన్నారు.
