కాంగ్రెస్ నేతల జోలికొస్తే తాట తీస్తం : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్వెలిచాల రాజేందర్‌‌ రావు

కాంగ్రెస్ నేతల జోలికొస్తే తాట తీస్తం : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్వెలిచాల రాజేందర్‌‌ రావు
  • కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జ్​వెలిచాల

కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ నేతల జోలికొస్తే తాట తీస్తామని, తమ ఓపికను అలుసుగా తీసుకుంటే బీజేపీ లీడర్లు వీధుల్లో తిరగలేరని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జ్​వెలిచాల రాజేందర్‌‌ రావు హెచ్చరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని, లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లోని మూడో డివిజన్ తీగలగుట్టపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కళ్లకు నల్ల గంతలు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా రాజేందర్‌‌రావు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. కాంగ్రెస్ నాయకుల సహనాన్ని బలహీనతగా భావించి బీజేపీ గుండాలు వరుసగా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, పార్టీ మూడో డివిజన్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి, నాయకులు పద్మాకర్ రెడ్డి, ఆర్ష మల్లేశం, కాశెట్టి శ్రీనివాస్, ఎలగందుల సర్పంచ్ అంజన్న, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.