ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు

ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ : గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు దీక్షకు దిగారు. కాంగ్రెస్ వార్ రూంలో పోలీసుల సోదాలపై మండిపడుతున్న నాయకులు.. ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు గాంధీ భవన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధం కాగా.. పోలీసులు వారిని గాంధీ భవన్ వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో పార్టీ నాయకులు గాంధీ భవన్ వద్ద దీక్ష చేపట్టారు.

మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముట్టడిస్తామని కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో సీసీసీ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ చుట్టూ ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.  సీసీసీ చుట్టు పక్కల ఒక్క వాహనాన్ని కూడా నిలపనివ్వడం లేదు.