MP చామలపై తప్పుడు వీడియోలు పోస్ట్‌‌..సైబర్‌‌ క్రైమ్‌‌ DCPకి కాంగ్రెస్‌‌ నేతల ఫిర్యాదు

MP చామలపై తప్పుడు వీడియోలు పోస్ట్‌‌..సైబర్‌‌ క్రైమ్‌‌ DCPకి కాంగ్రెస్‌‌ నేతల ఫిర్యాదు
  •     ఎంపీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపణ..  సైబర్‌‌ క్రైమ్‌‌ డీసీపీకి కాంగ్రెస్‌‌ నేతల ఫిర్యాదు

బషీర్‌‌బాగ్, వెలుగు : భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌కుమార్‌‌రెడ్డిపై తప్పుడు వీడియోలు పోస్ట్‌‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌‌ నేతలు డిమాండ్‌‌ చేశారు. ఎంపీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్‌‌ మీడియాలో అభ్యంతరకర, అసత్య వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం సైబర్‌‌ క్రైమ్‌‌ డీసీపీ చైతన్య కృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘మార్నింగ్‌‌ వీడియోలు’ పేరుతో కొందరు ఉద్దేశపూర్వకంగా వీడియోలు రూపొందించి సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ప్రచారంతో ప్రజల్లో అపోహలు కలిగే అవకాశం ఉందని, వీడియోలు పోస్ట్‌‌ చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్‌‌ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసినవారిలో టీపీసీసీ సీనియర్‌‌ అధికార ప్రతినిధి కల్వ సుజాత గుప్తా, హైదరాబాద్‌‌ మార్కెట్‌‌ కమిటీ వైస్‌‌ చైర్మన్‌‌ కోట్ల శ్రీనివాస్‌‌, మీడియా కమిటీ కోఆర్డినేటర్‌‌ శ్రీకాంత్‌‌ యాదవ్‌‌, టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్‌‌ ఉన్నారు.