
- కాంగ్రెస్ నేతల ప్రత్యేక పూజలు
- బిర్లా టెంపుల్, నాంపల్లి దర్గాలో ప్రార్థనలు
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ నేతలు బుధవారం హైదరాబాద్‌లోని బిర్లా టెంపుల్లో ప్రత్యేక పూజలు, నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేశారు. పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్మధుయాష్కీ, పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డును దేవుళ్ల దగ్గర పెట్టి పూజలు, ప్రార్థనలు చేయించారు. కాగా, పూజల అనంతరం గాంధీ భవన్లో నేతలందరూ వార్‌రూమ్‌లో సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో బూత్ లెవెల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు సూచనలు చేశారు.