దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కాంగ్రెస్ ఆందోళనలు

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కాంగ్రెస్ ఆందోళనలు

నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరయ్యారు. రాజకీయ కక్షతోనే  కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఈడీ టార్గెట్‌ చేసిందని  కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఎదుట నిరసన చేపట్టారు. సోనియాకు సంఘీభావం తెలిపేందుకు ఇప్పటికే పార్టీ లీడర్లు, కార్యకర్తలు సోనియా ఇంటివద్దకు చేరుకొని మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా పాట్నాలోనూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.  దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పార్టీ నేతలు ముందే ప్రకటించడంతో పోలీసు అప్రమత్తమై,... కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇటీవలే కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. అనంతరం గైర్హాజరు నేపథ్యంలో సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.