సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ సమావేశాలు

సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ సమావేశాలు

గ్రేటర్​ వరంగల్/ మధిర/ ములకలపల్లి, వెలుగు: సర్​ప్రక్రియపై కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సమావేశాలు నిర్వహించారు. సోమవారం హనుమకొండ డీసీసీ భవన్​లో వరంగల్​ పశ్చిమ నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల మీటింగ్​ నిర్వహించగా, వరంగల్​పార్లమెంట్​ ఇన్​చార్జి నాసీర్​అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి పాల్గొని డీసీసీ ప్రెసిండెంట్ వెంకట్రామ్ రెడ్డి, జిలా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ తో కలిసి మాట్లాడారు.

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను స్పీడప్​గా చేయాలన్నారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని కాంగ్రెస్​పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్ఐఆర్​ ఇన్​చార్జి దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొని ఇన్​చార్జిలు, సూపర్​వైజర్లకు దిశానిర్దేశం చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్​ ప్రక్రియను ఖమ్మం పార్లమెంట్​ కోఆర్డినేటర్​ నల్లపు దుర్గాప్రసాద్, అశ్వారావుపేట నియోజవర్గ కోఆర్డినేటర్​ తుమ్మ రాంబాబు, ములకలపల్లి కోఆర్డినేటర్​ 
రాజేశ్​పరిశీలించారు.