మంత్రి వర్గం కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి

మంత్రి వర్గం కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి

మంత్రివర్గం కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రేవంత్ రెడ్డితో చర్చించి మంత్రివర్గం ఖరారు చేయనున్నారు. ఎవరెవరిని మంత్రి వర్గంలో తీసు కోవాలి.. ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలని అనే దానిపై  రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చర్చించనుంది. 

మూడురోజులుగా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి.. ఎవరిని సీఎం చేస్తే బాగుండదని అభి ప్రాయ సేకరణ చేసిన ఢిల్లీ నేతలు.. ఇవాళ ( డిసెంబర్ 5) కాంగ్రెస్ అధిష్టానికి ఎమ్మెల్యేల అభిప్రాయాలను  సమర్పించారు. అభిప్రాయ పరిశీలన తర్వాత సీఎల్పీ నేత ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ  సీఎల్పీ నేతగా, సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించారు. ఎల్లుండి సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

సీఎం అభ్యర్థిగా రేవంత్ ను ప్రకటించిన వెంటన మంత్రి వర్గం నిర్మాణం పనిలో పడ్డారు ఢిల్లీ కాంగ్రస్ నేతలు. కేబినెట్ లో ఎవరిని తీసుకోవాలి.. పదవుల కేటాయింపుపై రేవంత్ రెడ్డి తో చర్చిస్తు్న్నారు. చర్చల అనంతరం  డిసెంబర్ 7న జరిగే ప్రమాణ స్వీకారం  లోపు కేబినెట్ ను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు ఢిల్లీ హైకమాండ్ దగ్గర లాబీయింగ్ పనిలో పడ్డారు.   
 
మరోవైపు డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లలో కాంగ్రెస్ శ్రేణులు బిజీబిజీగా గడుపుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు  సోనియాగాంధీ, మల్లికార్జున్ మరోఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ తదితర నేతలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వారిని కలిసి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రకటన వెలువడిన మరుక్షణమే ఆయన ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు.