ప్రతిపక్షాలను ఎవరు నడిపించాలో ప్రజలే నిర్ణయిస్తారు 

ప్రతిపక్షాలను ఎవరు నడిపించాలో ప్రజలే నిర్ణయిస్తారు 

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలను ఎవరు నడిపించాలో ప్రజలే నిర్ణయిస్తారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖ‌రిని, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. హస్తం పార్టీ నాయ‌క‌త్వం ఓ వ్యక్తికే చెందిన దైవ హక్కుగా భావిస్తున్నట్లు పీకే విమర్శించారు. కాంగ్రెస్ ఇక ఎంతమాత్రం ప్రతిపక్షాలను నడపలేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ కు ప్రతిపక్షాలను నడిపించే సత్తా లేదన్నారు. 

ప్రతిపక్షం ఎప్పుడూ బలంగా ఉండాలని.. విపక్ష సారథిని ప్రజాస్వామ్య రీతిలో ఎన్నుకోవాలని పీకే పేర్కొన్నారు. ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఇది చాలా అవసరమన్నారు. ప్రతిపక్షాలను ఎవరు నడపాలో ప్రజాస్వామ్యమే నిర్ణయిస్తుందని ట్వీట్ చేశారు. కాగా, కొన్ని నెలల కింద పీకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని రూమర్లు వచ్చాయి. రాహుల్ గాంధీతో ఆయన చర్చలు జరపడంతో ఆ పుకార్లకు బలం చేకూర్చింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకుని ప్రశాంత్ కిషోర్ పలుమార్లు విమర్శలు దిగుతుండటం గమనార్హం.