ఓటమి భయంతోనే దొంగ ఓట్ల పేరిట డ్రామా : మేడిపల్లి సత్యం

ఓటమి భయంతోనే దొంగ ఓట్ల పేరిట డ్రామా : మేడిపల్లి సత్యం
  • బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ దొంగ ఓట్ల పేరిట కొత్త డ్రామాకు తెరలేపిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. "జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. 

బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం కానుంది. ఓటర్ లిస్ట్ ను కాంగ్రెస్ తయారు చేయదు. ఈసీ తయారు చేస్తుందనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలి.  ఇక్కడ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితమే వస్తుంది. బీఆర్ఎస్ ఆరోపించిన 43 ఓట్ల గురించి ఈసీ ఇప్పటికే స్పష్టతనిచ్చింది" అని పేర్కొన్నారు.