తనపై ఫోన్ ట్యాపింగ్ జరిగింది.. మాజీ మంత్రిపై డీజీపీకి యెన్నం ఫిర్యాదు

తనపై ఫోన్ ట్యాపింగ్ జరిగింది..  మాజీ మంత్రిపై డీజీపీకి యెన్నం ఫిర్యాదు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనపై ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు ఆధారాలతో సహా డీజీపీకి ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఎస్ఐబీ అధికారులు ప్రశ్నించే గొంతులపై ఫోన్ ట్యాపింగ్ ప్రయోగించారని.. ఇందులో తాను కూడా ఒక బాధితుడినని చెప్పారు. 

రాజకీయక నేతలు,  వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు కొల్లగొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు.. ఈ ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నారని యెన్నం అన్నారు. గత పదేళ్లలో నిర్బంధ పాలన జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం కంటే... తెలంగాణలోనే ఎక్కువ నిర్భందాలు జరిగాయని చెప్పారాయన. ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారని తెలిపారు. మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రి ఆదేశాల మేరకు అధికారులు.. తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని ఆయన చెప్పారు. కాల్ రికార్డుల ఆధారంగా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారని అన్నారు.

ALSO READ | బిల్డర్లను బెదిరించి.. ఢిల్లీకి రూ.2వేల కోట్లు కప్పం కట్టిండు: కేటీఆర్

రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ కు ఈ ఫోన్ ట్యాపింగ్ విఘాతం కలిగించిందని..  కేవలం హైదరాబాద్ లోనే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తే బాధితులు బయటకు వస్తారన్నారు ఎమ్మెల్యే యెన్నం .