
అధికార పార్టీ ప్రతిపక్షాలను ప్రలోభాలకు గురి చేసి లొంగదీసుకోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ రోజు పెద్దపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి.. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వారి పార్టీలో చేర్చుకుందన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పోయినా.. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు తమతోనే ఉన్నారన్నారు జీవన్.
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో ఎవరికి న్యాయం జరగడం లేదని జీవన్ అన్నారు. గత ఐదు సంవత్సరాలలో టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకై ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడలేదని, ఎంపికైన టీఆర్ టీ ఉపాధ్యాయులకు పోస్టింగ్ లు లేవని ఆయన అన్నారు. ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు ఆ రాష్ట్ర సీఎం కృషి చేస్తున్నారని, ఈ విషయంలో జగన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు.
రాష్ట్రంలో విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమండ్ చేశారు జీవన్. ప్రాథమిక విద్య నుండే ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించాలని అప్పుడే గురుకాలల్లో నిరుపేదలకు సీట్లు లభిస్తాయని ఆయన అన్నారు.