నీ కొడుకు వయసున్న జగన్ ను చూసి బుద్ధి తెచ్చుకో

నీ కొడుకు వయసున్న జగన్ ను చూసి బుద్ధి తెచ్చుకో

బంగారు తెలంగాణ కాదని.. బతుకు తెలంగాణ, సామాజిక తెలంగాణ కావాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కొడుకు వయసున్న జగన్ ను చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారం కొరకు పాటుపడే సంస్థ PRTU అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 45% PRC ఫిట్ మెంట్ అమలు, CPS విధానం రద్దు చేయాలని PRTUTS టీచర్స్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో జరిగిన ధర్నాకు  MLC జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఆరేళ్లలో  కేజీ టూ పీజీ లేదు.. సక్సెస్ స్కూల్స్ లేవు, ఆంగ్ల మాధ్యమం అసలు ఊసేలేదన్నారు.  ప్రభుత్వ పాఠశాలలు మూతబడితే నిరుపేదలకి విద్య దూరం అవుతుందన్నారు.  ప్రైవేట్ యూనివర్సిటీల్లో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకుండా..ప్రభుత్వం విద్యను అమ్మకానికి పెట్టిందన్నారు. గురుకుల విద్యాలయ ప్రవేశాల్లో 50% ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించాలన్నారు.

ఏడేళ్లగా బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు.. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఊసేలేదన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. సీఎం  పదవి ఎడమకాలి చెప్పుతో సమానం అన్నాడు.. అదే చెప్పు పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావ్?అని కేసీఆర్ ను ప్రశ్నించారు. వీసీల నియామకం విషయంలో గవర్నర్ ప్రభుత్వంకు లేఖ రాసిందని..గవర్నర్ లేఖ ప్రభుత్వానికి  మొట్టి కాయలు వెయ్యడమేనన్నారు.

see more news

ఏడు నెలల్లో ఏడుసార్లు అమ్మకానికి గురైన 18 ఏళ్ల యువతి

జగన్ వద్దన్నా షర్మిల వినలే.. ఆమె పార్టీతో వైసీపీకి సంబంధం లేదు