సోషల్ మీడియాలో వింతలువిశేషాలతో పాటు కొన్ని వెరైటీ పోకడలు కూడా ట్రెండ్ అవుతుంటాయి. ఫ్యాషన్ ట్రెండ్ సోషల్ మీడియాలో లైకుల కోసం కొత్త పోకడలు పోతుంది. సెలబ్రెటీల బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు చూసే ఉంటారు.. అదేనండీ గర్భంతో ఉన్నప్పుడు గర్భిణి కడుపును హైలైట్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తున్న ట్రెండ్ ఇప్పటికే చూశాం.
After tattoos, now 'Baby Bump Mehendi' has become a new fashion trend.
— Rajveer (@RajveerIND) March 26, 2026
Women are now painting their baby bumps and making a public show of it.
Instead of teaching values, the whole family is supporting this kind of show-off.
In the past, women used to protect and hide the… pic.twitter.com/d6LNBDBfG1
ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ పేరుతో గర్భంతో ఉన్న భార్య కడుపును భర్త ముద్దాడుతూ ఉన్న ఫొటోలు, వీడియోలను కూడా చూశాం. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఫ్యాషన్ ట్రెండ్ మరో అడుగు ముందుకేసింది. గర్భంతో ఉన్న కొందరు మహిళలు బేబీ బంప్స్పై మెహందీ వేయించుకుంటున్నారు. ‘బేబీ బంప్ మెహందీ’ అని ఈ ట్రెండ్కు ఒక పేరు కూడా పెట్టారు. ఈ ట్రెండ్ను సదరు గర్భిణుల కుటుంబాలు కూడా ప్రోత్సహిస్తుండటం కొసమెరుపు.
ఒకప్పుడు.. గర్భంతో ఉన్న మహిళలు బేబీ బంప్ను కనబడకుండా దాచుకునే వారు. ఇప్పుడు కొందరు గర్భిణులు మాత్రం బేబీ బంప్ను బహిరంగంగా చూపిస్తే తప్పేంటని వాదిస్తున్నారు. మాతృత్వం వరమని, అంతటి అరుదైన అనుభూతిని నలుగురితో చెప్పుకుంటే తప్పేంటని.. బేబీ బంప్ బహిరంగంగా చూపించడం పాపం ఏం కాదనేది కొందరి మహిళల వాదన.
►ALSO READ | జై శ్రీరాం.. రాములోరి కళ్యాణం.. ఇంటింటా వేడుకలు..
అయితే.. ఈ ‘బేబీ బంప్ మెహందీ’ ట్రెండ్పై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మెహందీలో కొన్ని కెమికల్స్ మిక్స్ చేస్తారని.. అలాంటి మెహందీని గర్భంపై గోరింటాకులా పెట్టుకోవడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
Utter blashphemy 🤬.
— Team Jhaat Official👊 (@TeamJhaant__) June 27, 2025
A girl named Sohini draws Mahaprabhu Jagannath on her baby bump.
Can you guess her state ?😖 pic.twitter.com/AbccACtrBn
