రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భవనంపై నుంచి దూకి ఓ ఇంటర్‌విద్యార్థి సూసైడ్చేసుకున్నాడు. మణికొండ స్పెక్ర్టమ్ఐవివై అపార్ట్మెంట్ పెంట్‌హౌజ్‌లో శ్రీదేవి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు హేమంత్ శ్రీ సాయి(17) కోకాపేట్‌లోని ఎక్స్లెన్సీయా కాలేజీలో ఇంటర్సెకండియర్చదువుతున్నాడు.
బుధవారం తెల్లవారుజామున హేమంత్ తాను ఉంటున్న బిల్డింగ్ఐదో అంతస్థుపై ఉన్న పెంట్‌హౌజ్ పై నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. హేమంత్ మృతికి చదువు ఒత్తిడే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
