కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేకు ఊరట లభించింది. జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత కుసుమ కుమార్ లపై ఉన్న కేసుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు. గురువారం (2026, మార్చి 26)న విచారించిన కోర్టు.. ఇరువురిపై ఉన్న కేసును కొట్టివేసింది.
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో A1 గా ఉన్న తూర్పు జయప్రకాష్ రెడ్డి, A3గా ఉన్న కుసుమ కుమార్ ల కేసులో నేరాలు రుజువు కాలేదని పేర్కొన్న కోర్టు.. వారిని నిర్దోషుషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. జగ్గారెడ్డి, కుసుమ కుమార్ తరఫున న్యాయవాది జి. సంతోష్ రెడ్డి కేసును వాదించారు.
కేసు ఏంటి?:
జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2004 లో మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ నుంచి భార్య, కుమార్తె, కుమారుడి పేరున పాస్ పోర్టులు పొందారని అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత అమెరికా వీసా పొంది తన వెంట ఒక మహిళ, యువకుడిని తీసుకెళ్లి.. ఇండియాకు తిరిగి ఒక్కరే వచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఫేక్ డాక్యుమెంట్లతో ముగ్గురు వ్యక్తులను దేశం దాటించారని.. ఈ ప్రక్రియలో ఆర్థికంగా ప్రయోజనం పొందినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో 2018 లో అరెస్టై.. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. లేటెస్టుగా కేసును విచారించిన కోర్టు.. నేరాలు రుజువు కాలేదని కేసును కొటివేస్తూ తీర్పును వెలువరించింది.
►ALSO READ | ఇండస్ట్రీయల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన కాడ్లాపూర్ గ్రామస్థులు
