ఢిల్లీలో ఎంపీలతో నిరసనకు దిగిన రాహుల్ గాంధీ

ఢిల్లీలో ఎంపీలతో  నిరసనకు దిగిన రాహుల్ గాంధీ

పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఢిల్లీలోని విజయ్ చౌక్ ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ ఎంపీలు. మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్ అనే పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలు, ద్రవ్యోల్బణానికి నిరసనగా ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంటులో ఇంధనం ధరలపై అడిగితే కేంద్రం జవాబు చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధనం ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీలు.గత 10 రోజుల్లో 9 సార్లు పెట్రోల్,డీజిల్ రేటు పెరిగిందన్నారు రాహుల్ గాంధీ. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.