ప్రతీ అంశంలో కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు

ప్రతీ అంశంలో కేంద్రానికి టీఆర్ఎస్ మద్దతు

కేంద్రంలో వున్న బిజేపి సర్కార్, రాష్ట్రంలో వున్న టీఆరెఎస్ సర్కార్.. డైరెక్ట్ అలయెన్స్ లో ఉన్నాయని అందరికీ తెలుసన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతి అంశంలో కేంద్రానికి మద్దతు తెలిపిందన్నారు. చీకటి ఒప్పందంతో  బిజేపి, టీఆరెఎస్ కలిసి ఏడున్నర ఏళ్ల పాటు పని చేశాయన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీకి 100 ఏళ్ల చరిత్ర వుందన్నారు. అన్ని రాష్ట్రాలకు థర్మల్ పవర్ కు కోల్ ను సప్లయ్ చేస్తుందని తెలిపారు. కేంద్రం దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి టీఆరెఎస్ పరోక్షంగా మద్దతు ఇచ్చిందని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోల్డ్ మైన్స్ టెండర్ ప్రక్రియ మొదలైందన్నారు.

కొత్తగూడెం, సత్తుపల్లి, శ్రావణ్ పల్లి, కళ్యాణ్ బ్లాక్స్ ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం సిద్దమైందని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి దీనిపై పునరాలోచన చేస్తామన్నారు. వడ్ల కొనుగోలుపై కూడా పార్లమెంట్ సమావేశాల్లో చర్చించామన్నారు. టీఆరెఎస్ రైతులు తెలంగాణ సర్కార్ ను బొంద పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. పోయిన యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు. రబీ టార్గెట్ గా.. 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. సడెన్ గా వరి సాగు చెయ్యొద్దని అంటే ఎట్లా.. అంటూ ప్రశ్నించారు ఉత్తమ్. ఒక ఎకరం కూడా వేయవద్దని అంటే.. ఎలా అన్నారు. ప్రత్యామ్నాయ పంట ఏమి వేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు,.

పంజాబ్ రాష్ట్రం నుండి కోటీ మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ చేస్తే.. మన వద్ద నుండి ఎందుకు తక్కువ సేకరణకు ఒప్పుకున్నారన్నారు. మన మంత్రులు సన్నాసులు అన్నారని ఎద్దేవా చేశారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బంది పడతున్నారన్నారు. రైతుల ఉసురు టీఆరెఎస్ సర్కార్ తగులుతుందన్నారు. కనీస మద్దతు ధర.. రైతుల కోసమా, రైస్ మిల్లర్ల కోసమా..అంటూ నిలదీశారు. లక్ష టన్నుల ధాన్యం రైస్ మిల్లర్ల వద్దే వుందన్నారు. 

దాన్ని మిల్లర్లు డిఫాల్ట్ చేసిండ్రు.. వారిపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర సర్కార్ కు దమ్ము లేదు. కెసిఆర్.. పరిపాలన సర్వనాశనం చేసిండని దుయ్యబట్టారు ఉత్తమ్. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ అసలు ఎవరు నడిపిస్తున్నారో అర్దం కావడం లేదన్నారు. చిన్న రాష్ట్రాల నుండి ఎక్కువ మొత్తం లో ధాన్యం సేకరణ అవుతుంటే.. ఇక్కడ 40 లక్షల మెట్రిక్ టన్నులకు ఎట్లా ఒప్పుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లడుతుందన్నారు. రైతులు వరి సాగు చేయండి.. అసెంబ్లీ, పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు 3 లక్షల కోట్లు ఇచ్చారని.. రైతులకు 5వేల కోట్లు ఇవ్వలేరా అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉత్తమ్ ప్రశ్నించారు.