
లోక్ సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేసింది. సభలో కాంగ్రెస్ తో పాటు..విపక్షాలపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ సహా, ఇండియా కూటమి పార్టీలు ప్రకటించారు. మోదీ డౌన్ డౌన్ అంటూ సభ నుంచి వీడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
విపక్షాల వాకౌట్ పై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని చురకలంటించారు. మణిపూర్‌పై చర్చ జరిపే ఉద్దేశం విపక్షాలకు లేదని మండిపడ్డారు. విపక్షాల చర్చలో విషయమే లేదని ఎద్దేవా చేశారు. తాము చర్చకు ఆహ్వానించామని.... కానీ విపక్షాలు చర్చలకు రావడం లేదన్నారు. మణిపూర్‌పై చర్చ విపక్షాలకు అవసరం లేదన్నారు.
#WATCH | Opposition MPs walk out of the Lok Sabha as Prime Minister Narendra Modi speaks on #NoConfidenceMotion pic.twitter.com/2kYKRBiP1Z
— ANI (@ANI) August 10, 2023