ఏజెన్సీలను కేంద్రం ప్రతిపక్షాలపై ఉపయోగిస్తోంది : మల్లికార్జున ఖర్గే

ఏజెన్సీలను కేంద్రం ప్రతిపక్షాలపై ఉపయోగిస్తోంది : మల్లికార్జున ఖర్గే

బెంగళూరు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సీబీఐ, ఈడీలతో విపక్ష నాయకులపై దాడులు చేయిస్తోందన్నారు. పట్నాలో జరిగిన విపక్షాల భేటీలో 16 పార్టీలు సమావేశమైతే.. ఇవాళ్టి భేటీలో 26 పార్టీలు హాజరయ్యాయని ఖర్గే చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా ముఖ్యమన్నారు. దేశ ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూటమిగా పోరాడాల్సి ఉందన్నారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ఖర్గే చెప్పారు. 

విపక్షాల కూటమి పేరు I N DI A (ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్) గా నామకరణం చేశారు. దేశాన్ని రక్షించడమే కూటమి ప్రధాన ఎజెండా అని ఖర్గే చెప్పారు. 11 మందితో కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఉపయోగిస్తోందని ఖర్గే ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుతామన్నారు. ముంబైలో మరోసారి ఇండియా ఫ్రంట్ భేటీ ఉంటుందన్నారు. ఎన్డీఏలో 38 పార్టీలు ఉన్నాయన్నది అబద్ధమని చెప్పారు.