కాంగ్రెస్‌‌‌‌లో స్క్రీనింగ్ షురూ!.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

కాంగ్రెస్‌‌‌‌లో  స్క్రీనింగ్ షురూ!.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
  • ఎన్నికల కమిటీ మెంబర్స్‌‌‌‌తో స్క్రీనింగ్‌‌‌‌ కమిటీ భేటీ
  • సభ్యుల అభిప్రాయాలను వేర్వేరుగా రికార్డ్ చేసుకున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్
  • పీసీసీ మాజీ చీఫ్​లు, అనుబంధ సంఘాల నేతలకూ టికెట్లు ఇవ్వాలన్న జగ్గారెడ్డి
  • ఓయూ ఉద్యమకారులకు 3 టికెట్లు ఇవ్వాలని మానవతారాయ్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై పార్టీ స్క్రీనింగ్ కమిటీ కసరత్తులు షురూ అయ్యాయి. సోమవారం ఎన్నికల కమిటీ సభ్యులతో స్క్రీనింగ్​కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యుడు బాబా సిద్ధిఖీలు వన్ టు వన్ మీటింగ్ నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా కొనసాగిన ఈ సమావేశాల్లో 26 మంది సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. స్క్రీనింగ్ కమిటీలో ఎక్స్అఫీషియో మెంబర్లుగా ఉన్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ మీటింగ్స్‌‌‌‌కు దూరంగా ఉన్నారు. కమిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్​గా ఉన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం మురళీధరన్ ఎదుట తన అభిప్రాయాలను తెలిపారు. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశాలు.. 

మధ్యాహ్నం 12.30కు మొదలై రాత్రి 8 గంటలకు పూర్తయ్యాయి. బీసీలకు అవకాశం ఇవ్వాలంటూ చాలా మంది నేతలు మురళీధరన్‌‌‌‌ను కోరినట్లు తెలిసింది. ఉదయం జీవన్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతా రెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జానా రెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి వివరాలు తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ.. మధ్యాహ్నం దామోదర రాజనర్సింహా, మధు యాష్కీ గౌడ్, శ్రీధర్ బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, బలరాం నాయక్, పొడెం వీరయ్య, సీతక్క, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కె‌‌‌‌. ప్రేమ్ సాగర్ రావు, సునీతా రావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది.

సీనియర్లకు మొండి చెయ్యి చూపించొద్దు: జగ్గారెడ్డి

పీసీసీ మాజీ చీఫ్‌‌‌‌లు, పార్టీలో ఎన్నో ఏండ్ల నుంచి పనిచేస్తున్న సీనియర్లకు మొండి చెయ్యి చూపించొద్దని, వారికి టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. మురళీధరన్‌‌‌‌కు ఆయన వినతి పత్రం అందజేశారు. టికెట్ల కేటాయింపులో పీసీసీ మాజీ చీఫ్‌‌‌‌ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్లకు టికెట్లు ఇస్తే బాగుంటుందన్నారు. ఇటు పార్టీలో 5 నుంచి 10 ఏండ్ల పాటు పనిచేసిన నేతలకు టికెట్లు ఇవ్వాలన్నారు. ‘‘కొత్తగా వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తూనే.. ఎప్పటి నుంచో ఉన్న వారి ప్రాధాన్యం తగ్గకుండా చూసుకోవాలి. పార్టీ అనుబంధ సంఘాల నాయకులకూ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలి. 

ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషర్మెన్ కాంగ్రెస్ సెల్ చైర్మన్ మెట్టు సాయి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, ఎన్ఎస్‌‌‌‌యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, పీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు సుంకేట అన్వేశ్‌‌‌‌ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ నాగరి ప్రీతం, పీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ సొహైల్ ఖాన్, సేవాదళ్ చైర్మన్ మిద్దెల జితేందర్, హ్యాండీక్యాప్​సెల్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ప్రచార కమిటీ కన్వీనర్ సయ్యద్ హజ్మతుల్లా హుస్సేన్, అనిల్ కుమార్ యాదవ్‌‌‌‌లకు టికెట్ ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఉత్తమ్

న్యూఢిల్లీ, వెలుగు:తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్‌‌‌‌ అధిష్టానం కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. 16 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌‌‌‌ గాంధీ, అధిర్‌‌‌‌ రంజన్‌‌‌‌ చౌదరితో సహా తెలంగాణ నుంచి ఎంపీ ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డికి చోటు కల్పించారు. ఈ మేరకు సోమవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌‌‌‌ ఉత్తర్వులు రిలీజ్ చేశారు. ఈ కమిటీలో అంబికా సోని, సల్మాన్‌‌‌‌ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, టీఎస్‌‌‌‌ సింగ్‌‌‌‌ దేవ్, కేజే జార్జ్, ప్రీతమ్‌‌‌‌ సింగ్, మహమ్మద్‌‌‌‌ జావేద్, అమీ యాజ్ఞిక్, పీఎల్‌‌‌‌ పునియా, ఓంకార్‌‌‌‌ మార్కం, కేసీ వేణుగోపాల్‌‌‌‌ ఉన్నారు.

మురళీధరన్‌‌‌‌కు వినతులు

ఈసారి టికెట్ల కేటాయింపులో ఓయూ లీడర్లకు అవకాశం కల్పించాల్సిందిగా సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న మానవతా రాయ్ విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లోనే ఓయూ విద్యార్థులకు తగినన్ని సీట్లు ఇస్తామని ఇవ్వలేదని మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లారు. ఓయూ లీడర్లతో కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు. గతంలో ఓయూకు వచ్చినప్పుడు అక్కడి స్టూడెంట్ లీడర్లకు ఎక్కువ సీట్లు ఇస్తామంటూ రాహుల్ గాంధీ చెప్పారని, ఆ హామీని నిలబెట్టుకునేలా టికెట్లు ఇవ్వా లని మానవతారాయ్ కోరారు. కనీసం ముగ్గురు ఓయూ లీడర్లకు టికెట్లు ఇవ్వా ల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కొల్లాపూర్ టికెట్ రేసులో ఉన్న కేతూరి వెంకటేశ్, చెన్నూరు టికెట్ ఆశిస్తున్న దుర్గం భాస్కర్, జనగామ టికెట్​ ఆశిస్తున్న బాలలక్ష్మి, గద్వాల టికెట్ ఆశిస్తున్న విజయ్ కుమార్ వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

సర్వేలతో పోల్చి టికెట్లు

ఎవరికి టికెట్ ఇస్తారన్నది కేంద్ర ఎన్నికల కమిటీ చేతుల్లోనే ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సర్వేలు కొనసా గుతున్నాయని, ఆ సర్వేల ప్రకారం అప్లై చేసుకున్న ఆశావహుల గెలుపోటములను పరిశీలించి టికెట్​ ఇస్తామన్నారు. అయితే కొత్తగా పార్టీలో చేరే వారి విషయంలో మాత్రం.. నేతల పాపులారిటీ ఆధారంగా టికెట్ల కేటా యింపు ఉంటుందని, ఆయా చోట్ల అవకాశం రాని వారికి వేరే అవకాశాలుంటాయని చెప్పారు. తుమ్మల నాగేశ్వర్ రావు, షర్మిల వంటి నేతలు కాంగ్రెస్‌‌‌‌లో చేరేందుకు సిద్ధ మవుతున్న నేపథ్యంలో.. వారి టికెట్లపై సంది గ్ధం రాకుండా, పాపులారిటీ ఆధారంగా టికెట్లు కేటాయించే అవకాశాలున్నాయని చెప్తున్నారు.